ఆర్థికశాస్త్రంలో సీనియర్ లెక్చరర్‌గా పని చేస్తున్న ఆయన అనేక విద్యాలయాల్లో పని చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో విశేష గుర్తింపు పొందారు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అత్యధిక కాలం పరిపాలించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. ఐదు పర్యాయాలు అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా, రాజస్థాన్ నుంచి ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.