మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు. ఆయన హయాంలో గణనీయమైన జీడీపీ వృద్ధిరేటు నమోదుకాగా.. దేశంలో పేదరికం తగ్గుముఖంపట్టింది. 33 ఏళ్ల క్రితం 1991లో ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతరం పీవీ కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు.