మల్లేపల్లి: సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన కార్పొరేటర్
ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల పాలిట వరంగా మారిందని మల్లేపల్లి డివిజన్ ఏంఐఏం కార్పొరేటర్ మహ్మద్ జాఫర్ ఖాన్ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆసిఫ్ నగర్ కు చెందిన షాజహాన్ కు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును కార్పొరేటర్ అందజేశారు. రూ. 1, 15, 000 విలువ గల చెక్కును అందజేసినట్లు కార్పొరేటర్ వెల్లడించారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే చెక్కులు త్వరగా మంజురయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.