రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని సభ్యత్వ నమోదు కమిటీ చైర్మన్ రామచందర్ రావు అన్నారు. మంగళవారం హైకోర్టు వద్ద బార్ కౌన్సిల్ దగ్గర నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాంచందర్ రావు పాల్గొన్నారు. నిబద్ధత కలిగిన న్యాయవాదులు పెద్ద సంఖ్యలో సభ్యత్వం తీసుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.