తెలంగాణలో జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీల సంక్షేమ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, ఫహీముద్దీన్ ఖురేషీ, ఇతర నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.