ప్రజల సమస్యలు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన ప్రజల నుంచి ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఆటవీ భూముల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భూ సమస్యలు, ఉద్యోగ, ఉపాధి సమస్యలపై వినతులను మంత్రి స్వీకరించారు.