కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. తనపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆమె పరువు నష్టం దావా వేశారు. దీనిపై గురువారం న్యాయస్థానంలో విచారణ జరగనుండటంతో ఆమె ప్రత్యక్షంగా కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టుకు రావాలంటూ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు సూచించిన ఆయన రాకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.