దేశ జనగననలో కుల గణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బషీర్ బాగ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీసీ కులగణనను చేపట్టకపోతే దేశ వ్యాప్తంగా బీసీలు ఆందోళన చేపడతారని అయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేముల రామకృష్ణ పాల్గొన్నారు.