ఎస్సీ వర్గీకరణ అంశంపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటసమితి కన్వీనర్ రాజువస్తాద్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ అంబేద్కర్ భవన్లో జరిగిన మాలల దసరా సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కులగణన చేపట్టకుండా, వర్గీకరణపై కమిటీ ఎలా వేస్తారని ప్రశ్నించారు. త్వరలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తామన్నారు.