హైదరాబాాద్ ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 471 దరఖాస్తులు అందాయి. బీసీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి 156, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 87, విద్యుత్ శాఖకు సంబంధించి 75, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 50, ప్రవాసి ప్రజావాణికి సంబంధించి 4, ఇతర శాఖలకు సంబంధించి 99 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.