గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్ నగర జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయాలు, ప్రభుత్వం గత నెలలుగా చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలపై ప్రచారం, పార్టీ పటిష్టత తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జీ దిపదాస్ మూన్సి, కార్యకర్తలు, ఇంచార్జీ, మంత్రులు, తదితరులు పాల్గొన్నారు.