జీహెచ్ఎంసీ పార్కులో ప్రజలకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నామని మల్లేపల్లి డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ జాఫర్ ఖాన్ తెలిపారు. మంగళవారం భారత్ గ్రౌండ్ పార్కును కార్పొరేటర్ పరిశీలించారు. పార్కులో కొత్తగా ఓపెన్ జిమ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. దీనిని త్వరలోనే స్థానికులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్థానికులు ఓపెన్ జిమ్ ను ఉపయోగించుకోవాలని సూచించారు.