మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావుతో పాటు ఆయన కొడుకు విజిత్ రావు పై కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం సరి కాదని మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య అన్నారు. లక్షేట్టిపేటలో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి అవినీతికి పాల్పడని వ్యక్తి మన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆరోపణల్లో నిజం లేదన్నారు.