రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించి ఉపాధ్యాయులను విధుల్లోకి రావాలనడం సరికాదని ఓయూ జేఏసీ నాయకులు, జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరాల వంశీ అన్నారు. శుక్రవారం మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఆ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు దసరా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.