మంచిర్యాల జిల్లాలో ప్రత్యామ్నాయ వాణిజ్య పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్ లో జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, ఉద్యానవనాధికారి అనిత చౌదరితో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. సాగు చేసే రైతులు పత్తితో పాటు వాణిజ్య, ఉద్యానవన కూరగాయల పంటలు సాగు చేసి అధిక దిగుబడి పొందాలన్నారు.