సింగరేణి వ్యాప్తంగా కార్యాలయాలలో పనిచేస్తున్న స్టాప్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ బ్రాంచ్ నాయకులు మాట్లాడుతూ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటివరకు పరీక్ష తేదీ చెప్పకపోవడంతో కార్మికులు అయోమయానికి గురవుతున్నారన్నారు. వెంటనే పరీక్షలు నిర్వహించే తేదీని తెలియజేసి పరీక్షలు నిర్వహించి సిబ్బంది కొరతను తగ్గించాలని డిమాండ్ చేశారు.