బెస్ట్ ఎడ్యుకేటర్, బెస్ట్ కరస్పాండెంట్ అవార్డు ప్రదానం

74பார்த்தது
బెస్ట్ ఎడ్యుకేటర్, బెస్ట్ కరస్పాండెంట్ అవార్డు ప్రదానం
నస్పూర్ మున్సిపాలిటీ పరిధి సీసీసీలోని ఆదిత్య హై స్కూల్ కరస్పాండెంట్ గోపతి సత్తయ్య బెస్ట్ ఎడ్యుకేటర్, బెస్ట్ కరస్పాండెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆదివారం అఖిలభారత ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్, డిజిటల్ మీడియా, ట్రస్మా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ స్థాయి సెమినార్ లో ఆయనను ఘనంగా సత్కరించి అవార్డును అందజేశారు.‌ ఈ సందర్భంగా 32 ఏళ్లుగా విద్యారంగానికి సత్తయ్య అందిస్తున్న సేవలను కొనియాడారు.

தொடர்புடைய செய்தி