నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

62பார்த்தது
నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయ్ నగర్ లో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సె ఎం. సంతోష్ మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యత అన్నారు. నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా తనిఖీలు చేపట్టామని, అపరిచితుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని సూచించారు. అత్యవసర సమయంలో 100 నంబర్ కి కాల్ చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி