చెన్నూర్‌లో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నెత్తిపై గుదిబండలాగా వేయాలనుకున్న 18, 500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని, ప్రధాన ప్రతిపక్షంగా వ్యతిరేకించి ఆపిన సందర్భంగా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.