మందమర్రి ఏరియా కె కె ఓ సి ఆర్ వి ఆర్ ఓబి క్యాంపులో పనిచేసే వాహన డ్రైవర్లకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని వారు నిరసన వ్యక్తం చేశారు. ఓబీ ఎదుట ధర్నా చేపట్టి చెల్లించాల్సిన జీతాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్ అక్కడికి చేరుకొని బెల్లంపల్లి ఏరియా జిఎం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.