చెన్నూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ నిర్వహించారు. బస్తీలలో తిరుగుతూ అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అనంతరం తండ్రి మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త పెండ్యాల శ్రీనివాసును ఆయన పరామర్శించారు.