పంజాబ్లోని పటియాలాలో తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నాయకురాలైన మార్గరెట్ డిసౌజా అని పిలువబడే తారా బాయి తన మావయ్య పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆమె మామ విజయ్ సింగ్ను(81) రెండు చేతులతో నెట్టి మరీ కొట్టింది. ఆయన్ను ఇంట్లో పని చేయమని ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.