సింగరేణిలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సంస్థ మహిళా ఉద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు యాజమాన్యం శిక్షణ ఇచ్చి అందులో స్థిరపడేలా చేస్తుందని ఎస్ ఓ టు జిఎం రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం మందమర్రి ఏరియా కేకే ఓపెన్ కాస్ట్ లో మహిళా ఉద్యోగుల ఉద్దేశించి మాట్లాడారు. ఓపెన్ కాస్ట్ లకు సంబంధించి 16 పైగా డెసిగ్నేషన్లో మహిళా ఉద్యోగులకు అవకాశాలు కల్పించడం కోసం యాజమాన్యం శిక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు.