సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని మందమర్రి ఇన్చార్జి జిఎం రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిఎం కార్యాలయంలో సింగరేణి విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. ఆయన ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ ఈనెల 28 నుంచి నవంబర్ 3 వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.