సింగరేణియులు బొగ్గు ఉత్పత్తి చేయడమే కాకుండా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడం అభినందనీయమని మందమర్రి జిఎం దేవేందర్ కొనియాడారు. గురువారం ఏరియాలోని వృత్తి శిక్షణ కేంద్రంలో సింగరేణి, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జీఎం ప్రారంభించారు. జిల్లాలో సికిల్ సెల్, తల సేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు.