కన్నేపల్లి మండలంలోని లింగాల పంచాయతీ పరిధి నాగ పెళ్లి గ్రామానికి చెందిన లట్కరి కృష్ణయ్య అనే రైతు మేక విద్యుదా ఘాతంతో గురువారం మృతి చెందింది. మేకను మేతకు వదిలిన సమయంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. తాను నష్టపోయానని, ఆదుకోవాలని ఆయన అధికారులను కోరారు.