సద్దుల బతుకమ్మ, దసరాకు ఇంటిల్లిపాది నూతన వస్త్రాలు ధరిస్తారు. ఏడాదంతా జరిగే విక్రాలతో పోలిస్తే ఈ పండుగ రోజుల్లో జరిగేవి ఎక్కువగా ఉంటాయి. పండుగలు సమీపిస్తుండటంతో కొద్ది రోజులుగా బెల్లంపల్లి బజార్ ఏరియాలో వస్త్ర, అలంకరణ వస్తువులు దుకాణాలు కళకళలాడుతున్నాయి. దసరా పండుగ విక్రయాలు సింహభాగం సింగరేణి కార్మిక కుటుంబాలదే ఉండడంతో పండుగ వాతావరణం నెలకొంది.