రహస్య కెమెరాలతో జంటల ఏకాంత క్షణాలను వీడియో తీసిన శంషాబాద్‌లోని ఓయో హోటల్ నిర్వాహకుడు అరెస్టు

565பார்த்தது
రహస్య కెమెరాలతో జంటల ఏకాంత క్షణాలను వీడియో తీసిన శంషాబాద్‌లోని ఓయో హోటల్ నిర్వాహకుడు అరెస్టు
శంషాబాద్‌లోని సిటా గ్రాండ్ ఓయో హోటల్ నిర్వాహకుడు గణేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు హోటల్ కు వచ్చిన జంటలు ఏకాంతంగా గడిపిన క్షణాలను రహస్య కెమెరాల ద్వారా వీడియోలు తీసి, వాటిని చూపించి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించారు. గణేశ్ హోటల్ గదుల్లోని బల్బు హోల్డర్లలో ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ జంట సీక్రెట్ కెమెరాలను గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.

தொடர்புடைய செய்தி