ఉత్తరప్రదేశ్‌లోని తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జేబులోంచి తన భార్య కేవలం రూ.10 తీసిందని కోపంతో భర్త దారుణంగా కొట్టాడు. ఆమెను కింద పడేసి కాళ్లతో తన్నుతూ.. కర్రతో విచక్షణా రహితంగా కొట్టాడు. కొట్టవద్దని ఆమె ఎంత వేడుకున్నా వదల్లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.