వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లో పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 8: 00 గంటల వరకు 45వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. దీంతో జెన్ కో జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. ఇందుకోసం 37, 480, ఎడమ కాల్వకు 1, 030, కుడి కాల్వకు 731, సమాంతర కాల్వకు 400, భీమా లిఫ్టు-2కు 750 క్యూసెక్కులు వదలగా 92 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రస్తుతం 8. 830 టీఎంసీల నీరు నిల్వ ఉంది.