మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వనపర్తి వాసి మృతి

71பார்த்தது
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వనపర్తి వాసి మృతి
మెదక్ జిల్లా నర్సాపూర్ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వనపర్తి జిల్లా వాసి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ లింగం వివరాల ప్రకారం.. పాన్ గల్ మండలం శాఖాపూర్ కు చెందిన బింగి శ్రీకాంత్ కుమర్ (30) ఏడుపాయల దర్శనం చేసుకోని తిరిగివస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. భార్య భారతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி