సమాజంలో పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని సోమవారం నారాయణపేట ఎస్పి పరేడ్ మైదానంలో అమరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమరుల కుటుంబాలను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అమరుల కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని, ఏవైనా ఇబ్బందులు వుంటే తమ దృష్టికి తేవాలని అన్నారు.