బహుజనులకు రాజ్యాధికారం లభించినప్పుడే వారి జీవితాల్లో మార్పులు వస్తాయని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాగన్న అన్నారు. ఆదివారం నారాయణపేట అంబేద్కర్ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. బహుజనుల ఆత్మగౌరవం బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఉచిత పథకాలతో బహుజనులను పార్టీలు మోసం చేస్తున్నాయని అన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.