ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న సీనియర్ మేటీలను ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించాలని కోరుతూ బుధవారం నారాయణపేట డిఆర్డిఎ పిడి మోగులప్పకు వినతి పత్రం అందించినట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లు లేని గ్రామాలలో గత ఐదేళ్లుగా మేటీలు ఉపాధి కూలీలకు పనులు కల్పిస్తున్నారని చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించి కనీస వేతనాలు అందించాలని పిడిని కోరారు.