నారాయణపేట కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాధితులకు భరోసా కల్పించారు. మొత్తం 38 అర్జీలు అందించినట్లు కలెక్టర్ చెప్పారు. ఫిర్యాదులు పెండింగ్ లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.