నారాయణపేట జిల్లా కేంద్రంలోని మెట్రో ఫంక్షన్ హాల్ లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన లక్ష డప్పులు వేల గొంతులు సన్నాహక సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డప్పులు వాయిస్తూ ఫంక్షన్ హాలులోకి వచ్చారు. సన్నాహక సదస్సుకు పెద్ద సంఖ్యలో ఎమ్మార్పీఎస్ నాయకులు, మాదిగ సోదరులు హారయ్యారు.