దామరగిద్ధ మండలం ముస్తపేట గ్రామంలో శనివారం సి ఎచ్ ఓ నారాయణ గ్రామస్తులకు గుట్కా, సిగరెట్, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ప్రజలు, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు, గుట్కా, సిగరెట్, ఖైని, జర్దాలకు దూరంగా వుండాలని అన్నారు. వాటిని తీసుకోవడం ద్వారా భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం వుంటుందని అన్నారు. కార్యక్రమంలో ఏ ఎన్ ఎం, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.