అమ్మాయిలను వేధిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని షి టీమ్ పోలీసులు బాలరాజు అన్నారు. శనివారం నారాయణపేట అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలో షీ టీం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేయడం చట్టం ప్రకారం నేరమని హెచ్చరించారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే షి టీమ్ పోలీసులకు నేరుగా లేదా 8712670398 నంబర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని చెప్పారు. సిబ్బంది పాల్గొన్నారు.