విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిపాదనల ద్వారా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం విశ్వకర్మ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ లోని పోతులూరివీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కులాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టితో పనిచేస్తుందని అన్నారు