గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ఆశయ సాధనలైన నీళ్లు, నిధులు, నియామకాలు చేపట్టకుండా, కేవలం జీవోలు ఇచ్చి కాలయాపన చేసిందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి విమర్శించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కానీ జీవోలు ఇచ్చి ఓడిపోయిందని అన్నారు.