కుటుంబ సభ్యుల వివరాల సేకరణ, డిజిటల్ కార్డుల జారీ కోసం పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వెల్దండ మండలం కంటోనిపల్లి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామ పరిధిలో కేశమోని పెంటమ్మ, జావాజీ నాగమ్మల ఇండ్ల వద్ద కొనసాగుతున్న డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.