కళాశాల విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఏఎస్పీ రామేశ్వర్ హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా వైద్య కళాశాలలో శుక్రవారం యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం నిర్వహించగా అదనపు ఎస్పీ పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు. తోటి విద్యార్థుల నుంచి ఎలాంటి ఇబ్బందులు కల్గిన తక్షణమే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలన్నారు.