నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. గురువారం శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్‌లో చేపట్టనున్న క్రూయిజ్ టూర్‌ను ఈ నెల 26న ప్రారంభించనున్నారు. కొల్లాపూర్‌లోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు సింగిల్ రైడ్‌తో పాటు రౌండప్ క్రూయిజ్ జర్నీ ధరలను ప్రకటించారు. సింగిల్ జర్నీలో పెద్ద వాళ్లకు రూ. 2 వేలు, చిన్నారులకు రూ. 1, 600 ధరను నిర్ణయించారు.