అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్న వాహనాన్ని జప్తు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. బుధవారం కల్వకుర్తి పట్టణ శివారులో ఎన్ఫోర్స్మెంట్ డీటీ రాఘవేందర్ రెడ్డితో కలిసి వాహనాల తనిఖీలు చేయగా, వెల్దండ వైపు నుంచి కల్వకుర్తి మీదుగా
నాగర్ కర్నూల్ వైపు వెళ్తున్న బొలెరొ వాహనంలో 21 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించడంతో వాహనాన్ని జప్తు చేసి కేసు నమోదు చేసి నట్లు ఎస్ఐ తెలిపారు.