కేంద్ర పర్యాటక శాఖ ఎనిమిది కేటగిరీలలో నిర్వహించిన పోటీలలో "స్పిరిచ్యువల్ - వెల్నెస్ " కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల ఎంపిక చేశారు. శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ అవార్డుల ప్రదానోత్సవం చేశారు. సోమశిల జిల్లా పర్యాటక శాఖ అధికారి టి. నర్సింహా ఈ అవార్డులను అందుకున్నారు.