గుండె నొప్పితో బాధపడుతూ హైదరాబాదులోని స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం వంగూరు మండల కేంద్రంలోని గెల్వలాంబ మాత ఆలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు.