ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నాగర్ కర్నూల్ కూచకుళ్ళ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ప్రజలు దేవాలయాలకు వెళ్లి తమ మొక్కుబడులను తిర్చుకున్నారు.