జీవో నెంబర్ 29తో ఉద్యోగులకు అన్యాయం
By శివ 69பார்த்ததுజీవో నెంబర్ 29తో బహుజన ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘనేతలు తెలిపారు. బుధవారం నాగర్ కర్నూల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జీవో నెంబర్ 29ని పత్రాన్ని దగ్దం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ పేరుతో అన్యాయం చేస్తుందని, జీవో 3తో దళితులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. జీవో నెంబర్ 29 రాజ్యాంగబద్ధమైనది కాదని, భవిష్యత్తులో జరిగేటటువంటి రిక్రూట్మెంట్లో బీసీలకు ఉద్యోగాలు దక్కే అవకాశం లేదన్నారు.