తక్కువ విస్తీర్ణంలో అధిక సాంద్రతతో పత్తి సాగు చేపడితే అన్నదాతలు అధిక ఆదాయం పొందవచ్చని కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. బిజినేపల్లి మండలం పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శుక్రవారం పత్తిపంట పై అవగాహన సదస్సు నిర్వహించారు. పంటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలను వివరించారు. పంటల సాగులో వైవిద్యం పాటిస్తే నేల ఆరోగ్యంతో పాటు పంట దిగుబడి పెరుగుతుందన్నారు.