ఉట్కూర్: ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి

81பார்த்தது
ఉట్కూర్ మండలం పులిమామిడి గ్రామ శివారులోని కొండపై వెలసిన రామలింగేశ్వర స్వామి వారిని ఆదివారం ఆబ్కారీ, పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తో కలిసి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు మంగళ హారతులు చేశారు. ఆలయం అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయం వరకు రోడ్డు నిర్మాణం, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి చెప్పారు.

தொடர்புடைய செய்தி